అధిక ఆకలికి ఇలా చెక్ పెట్టండి..

TV9 Telugu

03 August 2024

కొంతమంది అడ్డూ అదుపులేని ఆకలి సమస్యతో బాధపడుతుంటారు. జీవనశైలిలో స్వల్ప మార్పులు చేసుకుంటే అర్థంలేని ఆకలి సమస్య నుంచి గట్టెక్కవచ్చు.

డయాబెటిస్‌ రోగులు ఎప్పుడూ ఆకలితో ఉంటారు. శరీర కణాల్లోకి చేరే గ్లూకోజ్‌ రక్తంలోనే ఉండిపోవడం వల్ల ఆకలి వేస్తుంటుంది.

తగినంత నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని ఆకలి పెరగడానికి కారణం అవుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

రిఫైన్డ్‌ కార్బొహైడ్రేట్లకు బదులుగా సిరిధాన్యాల ద్వారా లభించే కాంప్లెక్స్‌ కార్బొహైడ్రేట్లను ఆహారంగా తీసుకున్నట్లయితే ఆకలి అదుపులో ఉంటుంది.

శరీరానికి తగినన్ని ప్రొటీన్లు అందితే కడుపు నిండిన భావన కలుగుతుంది. పైగా ఆకలిని ప్రేరేపించే హార్మోన్ల స్థాయి అదుపులో ఉంటుంది.

పాలు, యోగర్ట్‌, చిక్కుడు జాతి కూరగాయలు, చేపలు, మాంసం, గుడ్లు లాంటి ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం ద్వారా అర్థం లేని ఆకలి సమస్య నుంచి గట్టెక్కవచ్చు.

జర్నల్‌ ఆఫ్‌ థైరాయిడ్‌ రీసెర్చ్‌ అధ్యయనం ప్రకారం హైపర్‌ థైరాయిడిజం వల్ల కూడా పదేపదే ఆకలి ఎక్కువగా వేస్తుంది.

ఎక్కువ ఒత్తిడికి లోనవడం వల్ల కూడా కార్టిసోల్‌ హార్మోన్‌ అధికంగా విడుదలై ఆకలి పెరుగుంది. ఫైబర్‌ ఎక్కువగా ఉన్న పదార్థాలను ఆహారంగా తీసుకుంటే ఫలితం ఉంటుంది.