బ్యూటీ ప్రొడక్ట్స్‌లో వాడే పదార్థంతో జన్యువుల్లో మార్పులు
06 November 2023
ప్రస్తుత కాలంలో బ్యూటీ ప్రొడక్ట్స్ కి డిమాండ్ బాగా పెరిగింది. ఫేస్ నుంచి మొదలు శరీరం అన్ని భాగాల కోసం వీటిని వాడుతున్నారు.
వీటిలో ఉన్న కెమికల్స్ కారణంగా చాలామందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. తాజాగా వీటివల్ల కలిగే మరికొన్ని ఆనారోగ్య సమస్యలు బయటపడ్డాయి.
ఇళ్లలో వాడే కొన్నిరకాల ఉత్పత్తులు అలాగే బ్యూటీ ఉత్పత్తులలో ఫార్మాల్డిహైడ్ అనే రసాయనం కొంత మోతాదులో ఉంటుంది.
ఫార్మాల్డిహైడ్‌కి జన్యువులను నియంత్రించే వ్యవస్థల్లో మార్పులు జరిపే ప్రమాదం ఉందని తాజాగా వెల్లడైంది.
స్పెయిన్‌లోని కారెరాస్ లుకేమియా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఈ అంశంపై చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది.
ఫార్మాల్డిహైడ్ కలుషిత గాల్లో కూడా ఉంటుంది. ఈ ఫార్మాల్డిహైడ్ నిర్మాణ రంగంలో విస్తృతంగా ఉపయోగిస్తారు.
దీని వల్ల క్యాన్సర్, ఉబ్బసం, కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. శరీరంలో మిథైలేషన్ అనే ప్రక్రియను ఇది అడ్డుకుంటున్నట్లు తాజాగా గుర్తించారు.
ఫార్మాల్డిహైడ్ శ్వాస ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అది నీటిలో సులువుగా కరిగిపోతుంది. అందువల్ల చాలా తేలికగా శరీరంలోని అన్ని కణాలకు చేరిపోతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి