ఆకస్మిక మరణాలకు కారణాలు ఇవే..
TV9 Telugu
19 August 2024
కరోనా పాండమిక్ తర్వాత ఆకస్మిక మరణాలు.. ముఖ్యంగా తక్కువ వయసు వారిలో ఎక్కువయ్యాయి అనే చర్చ సాగుతూ ఉంది.
కరోనా నివారణకు వేసిన టీకాలతోనే గుండె జబ్బుల ముప్పు పెరిగిందనే అనుమానాలు చాలామంది ప్రజల్లో బలపడుతూ వచ్చాయి.
అయితే అదంతా అపోహ మాత్రమేనని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు అధ్యయనం ద్వారా తేల్చి చెప్పారు.
కుటుంబ ఆరోగ్య చరిత్ర, మితిమీరిన మద్యపానం, అలవాటు లేని పనులు ఆకస్మిక మరణాలకు కారణాలు కావచ్చని స్పష్టం చేశారు.
అధ్యయనంలో భాగంగా ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు మొత్తం 3,645 మందిలో కరోనా కారణంగా ఆసుపత్రుల్లో చేరి 24 గంటల్లోనే మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఆకస్మిక మరణాలన్నీ కార్డియాక్ అరెస్ట్ ఫలితంగానూ జరగలేదని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
మద్యపానం ఎంత తరచుగా తీసుకుంటూంటే ఆకస్మిక మరణానికి అవకాశాలు అంత ఎక్కువగా పెరిగినట్లు అధ్యయనంలో గుర్తించామన్నారు.
అయితే సార్స్ కోవ్-2 వ్యాధి వల్ల గుండెజబ్బు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువయిందని మాత్రం అధ్యయనంలో గుర్తించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి