వయసు పెరుగుతున్నా కొద్దీ ఆందోళన, కుంగుబాటు, అధిక కొలెస్ట్రాల్ వంటివి కూడా పక్షవాతం రావడానికి కారణం అవుతుంటాయి.
అయితే ఇప్పుడు గాలి కాలుష్యం వల్ల కూడా పక్షవాతం వస్తుందంటున్నారు వైద్య నిపుణులు. గాలి కాలుష్యం కూడా పక్షవాతం కారకంగా చెబుతున్నారు.
పీల్చే గాలి కలుషితం కావడం వల్ల పక్షవాతం ముప్పు 30% పెరుగు తున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ జోర్డాన్ అధ్యయనకారులు తేల్చి చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 110 పరిశీలన అధ్యయనాలను సమీక్షించి గాలి కాలుష్యం ఎఫెక్ట్ ఊపిరితిత్తులు, కళ్లకు మాత్రమే కాకుండా మెదడు, గుండె రక్తనాళాల వ్యవస్థపైనా ఉంటుంది.
నైట్రోజన్ డయాక్సైడ్ ఎఫెక్ట్‌కు గురయ్యాక ఐదు రోజుల వరకు పక్షవాతం ముప్పు 30% ఉంటుంది. అదే కార్బన్ మోనాక్సైడ్‌తో 26% ముప్పు ఉంటుంది.
సల్ఫర్ డయాక్సైడ్‌తో 15%, ఓజోన్ ప్రభావంతో 5% పక్షవాతం ముప్పు ఉంటుందని పరిశోధనకారులు వివరించారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి.
పక్షవాతంతో మరణించే ముప్పు నైట్రోజన్ డయాక్సైడ్‌తో 33%, సల్ఫర్ డయాక్సైడ్‌తో 60% అధికంగా ఉంటుందని కూడా అధ్యయనకారులు నివేదించారు.
గాలిలోని నుసి పదార్థం పీల్చినప్పుడు ఊపిరితిత్తుల్లో వాపు, చికాకుకు కారణమవుతుంది. రోగనిరోధక వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. తద్వారా పక్షవాతం వచ్చే ముప్పు ఉంటుందిన అధ్యయనకారులు వెల్లడించారు.