చిన్నవయస్సులోనే జుట్టు నెరిసిపోవడానికి కారణాలు..

08 October 2023

దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళన కారణంగా చిన్నవయస్సులోనే జుట్టు నేరిసిపోయే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సమస్య తగ్గుతుంది.

ఒత్తిడిని కంట్రోల్‌లో ఉంచుకోవడం మేలు. అలాగే ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు, సంగీతం వినడం వంటివి చేయండి.

చిన్నవయస్సులోనే జుట్టు నెరిసిపోవడానికి కాలుష్యం, లైఫ్‌స్టైల్ లో మార్పు ప్రధాన కారణాలని చెబుతున్నారు నిపుణులు.

శారీరక శ్రమ లేకపోవడం మరో కారణం. రెగ్యులర్‌గా వ్యాయామంతో అవసరమైన పోషకాలు హెయిర్ ఫోలికల్స్‌కు చేరేలా చేయొచ్చు.

షాంపూలలో రసాయనాలు జుట్టు కుదుళ్లను దెబ్బతీసి మెలనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తాయి. అందుకే సరైన షాంపూను ఎంచుకోండి.

నిద్రలేమి కారణంగా జుట్టు త్వరగా తెల్లబడే అవకాశం ఉంది. నిద్ర సరిపోకపోతే జుట్టు తెల్లబడే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

పోషకాహార లోపంతో జుట్టు త్వరగా తెల్లబడే అవకాశం ఉంది. బి12, ఫోలిక్‌ యాసిడ్‌, సి, ఇ విటమిన్లు ఉన్న డైట్‌ తీసుకోవడం మంచిది.

జంక్‌ ఫుడ్‌ వల్ల కూడా జుట్టు త్వరగా నెరిసిపోయే అవకాశం ఉంది. బదులుగా ఆకుకూరలు, పండ్లు, బాదం, గుమ్మడి గింజలు ఆహారంలో చేర్చాలి.