హార్ట్ ఫెయిల్యూర్ కారణాలు.. అధునాతన చికిత్సా పద్ధతులు ఇవే..
11 November 2023
గుండె వైఫల్యాన్ని ముందుగానే గుర్తించి, మెరుగైన చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి కాపాడే అవకాశం ఉంటుంది.
హార్ట్ ఫెయిల్యూర్ రోగులకు ప్రస్తుతం అధునాతన చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.
షుగర్ లెవెల్స్ పెరగడం, రక్తపోటు, గుండె రక్తనాళాల్లో పూడికలు, సైలెంట్ హార్ట్ ఎటాక్‌కు ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు.
ఆయాసం, నీరసం, అలసట, కాళ్లలో, పొట్టలో వాపు, నీరు చేరడం వంటి లక్షణాలు ఉంటే హార్ట్ ఫెయిల్యూర్ అయినట్టు గుర్తిస్తారు.
హార్ట్ ఫెయిల్యూర్‌కు గురైన వారికి వెంటనే చికిత్స అందించడం ద్వారా ప్రాణాపాయం నుంచి కాపాడొచ్చని గుండె నిపుణులు అంటున్నారు.
ఇటీవల కాలంలో హార్ట్ ఫెయిల్యూర్ సమస్య కారణంగా చాలామంది రోగులు ఎక్కువగా ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.
గుండె పంపింగ్ తగ్గడంతో పాటు, పంపింగ్ నార్మల్‌గా ఉన్న వారిలో కూడా హార్ట్ ఫెయిల్యూర్ సమస్య తలెత్తుతుంది.
గుండె సంబంధిత చికిత్సలో ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ, అత్యవసర బైపాస్ సర్జరీతో పాటు, పలు డివైజ్‌లు అమరుస్తారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి