ఉదయం నిద్రలేవగానే తలనొప్పికి కారణం ఇదే.. 

TV9 Telugu

23 August 2024

ముఖ్యంగా శరీరంలో సరిగా రక్తం లేకపోవడం. అదే సమయంలో శరీరంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల తలనొప్పితో పాటు బలహీనత, మైకము లాంటి సమస్యలు వస్తాయి.

మీ శరీరంలో చక్కెర అసాధారణంగా ఉంటే మార్నింగ్ సిక్‌నెస్ లక్షణాలను చూడవచ్చు. మార్నింగ్ సిక్‌నెస్ లక్షణం కూడా తలనొప్పి ఒకటి.

రాత్రి వేళ తక్కువ నీరు తాగితే ఉదయం నిద్రలేచిన తర్వాత తలనొప్పి వస్తుంది. దీనికి ప్రధాన కారణం శరీరంలో నీటి కొరత.

తగినంత నీరు తాగకపోవడం వల్ల ఉదయం నిద్రలేచిన తర్వాత తలనొప్పి సమస్య రావచ్చు. అందుకే నీరు ఎక్కువ తీసుకోవాలి.

నిద్రలేమి కారణంగా ఉదయం తలనొప్పి వస్తుంది. అదే సమయంలో చాలా మందిలో ఒత్తిడి కారణంగా, తలనొప్పి సమస్య వస్తుంది.

రాత్రి షిఫ్టులో పనిచేసే వ్యక్తులు కూడా ఎక్కువగా తలనొప్పి సమస్యతో బాధపడుతుంటారు అని నిపుణులు చెబుతున్నారు.

ఉదయం నిద్ర నుంచి లేవగానే నిమ్మరసం తాగాలి. చల్లటి నీళ్లకు బదులు నిమ్మరసాన్ని సాధారణ నీటిలో కలిపి తాగవచ్చు.

తలనొప్పి తగ్గేందుకు కాస్త విశ్రాంతి తీసుకోండి.. ఇంకా నిద్ర పోవడం, కాసేపు యోగా, ధ్యానం చేస్తే తలనొప్పి సమస్య తగ్గుతుంది.