వర్క్‌ ఫ్రం హోం తర్వాత పెరిగిన ఫ్యాటీ లివర్ కేసులు

TV9 Telugu

30 April 2024

కాలేయంపై కొవ్వు పేరుకునే ఫ్యాటీ లివర్‌ సమస్యతో బాధపడున్న ప్రజల సంఖ్య హైదరాబాద్ లో క్రమంగా పెరుగుతోంది.

కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో చాలా కంపెనీలు వర్క్‌ ఫ్రం హోం విధానాన్ని అనుసరించాయి, కొన్ని నేటికీ కొనసాగిస్తున్నాయి.

తగిన వ్యాయామం లేని ఇలాంటి జీవనశైలి నగరంలో 50 శాతం మందికి పైగా అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారని వైద్యులు తేల్చారు.

గతంలో ప్రతి 10-15 మందిలో ఒకరికి ఈ సమస్యను గుర్తిస్తే.. ప్రస్తుతం ప్రతి ఇద్దరిలో ఒకరికి ఉంటోందని చెబుతున్నారు.

ఒకే చోట కూర్చొని గంటల తరబడి పనిచేయడం, ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్లు తెప్పించుకొని తినడం కేసుల పెరుగుదలకు ప్రధాన కారణం

అవసరానికి మించి కేలరీలు తీసుకోవడంతో కాలేయంలో కొవ్వు నిల్వలు పెరుగుతున్నాయి. చివరకు లివర్‌ సిర్రోసిస్ వ్యాధికి దారితీసే ప్రమాదం

మద్యపానం వల్ల కొందరిలో ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్ కూడా కనిపిస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మద్యం అలవాటు లేని వారిలో అధిక బరువు కారణంగా ముప్పు పెరుగుతోందని చెబుతున్నారు వైద్య నిపుణులు, డాక్టర్లు.