తినకుండా వ్యాయామం చేస్తే బెటరా లేక తిన్న తర్వాత చేస్తే మంచిదా..
17 October 2023
చాలా మంది రాత్రి నుంచి ఏమీ తినకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఫాస్టెడ్ వర్కౌట్ చేయడానికి ఇష్టపడుతుంటారు.
ఏమీ తినకుండా ఫాస్టెడ్ వర్కౌట్ చేస్తే బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గుతుందని చాలా మంది అభిప్రాయపడుతుంటారు.
ఏం తినకుండా ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు ఇన్సులిన్ స్థాయిలు తక్కువగా ఉన్నందు వల్ల బాడీలో కొవ్వుని కరిగిపోతుంది. తద్వారా బరువు తగ్గుతుంటారు.
కానీ పరగడుపున ఎక్సర్‌సైజ్ చేస్తే తొందరగా శక్తిని కోల్పోతారు. తద్వారా ఎక్కువ సేపు వ్యాయామం చేయలేరు. త్వరగా అలసిపోతుంటారు.
వర్కౌట్‌కు ఉపక్రమించే ముందే తేలికపాటి ఆహారం నట్స్, గ్రెయిన్స్, ఏవైనా పండ్లు వంటి పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే బెటర్ అంటున్నారు నిపుణులు.
బరువు తగ్గడానికి వర్కౌట్ చేయాలనుకుంటే ఎప్పుడూ తక్కువ శ్రమతో కూడిన ఎక్సర్‌జైజ్‌లు ఎక్కువ సేపు చేయాలి.
ఎక్సర్‌సైజ్‌కు ముందు , తర్వాత తగినంత నీరు తాగాలి. గ్లూకోజ్ రికవరీ కోసం ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న పోషకాహారం తీసుకోవాలి.
మొత్తానికి బరువు తగ్గడానికి ఖాళీ కడుపుతో వర్కౌట్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తే హాయిగా ఏదైనా తిని వర్కౌట్ చేయడం ఉత్తమం అంటున్నారు నిపుణులు
ఇక్కడ క్లిక్ చెయ్యండి