జపనీస్ వాటర్ థెరపీ వల్ల బరువు తగ్గుతారా..

16 December 2023

బరువు తగ్గాలనుకొనేవారి కోసం ఈ మధ్య కాలంలో జపనీస్ వాటర్ థెరపీ అనే డైట్ ఫ్లాన్ ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

పురాతనమైన జపనీస్ వాటర్ థెరపీ ద్వారా చాలా వరకూ తేలికగా బరువు తగ్గే వీలుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

జపనీస్ వాటర్ థెరపీలో ముందు ఉదయం నిద్రలేవగానే 160 నుంచి 200 ఉష్ణోగ్రతతో ఉన్న వేడినీటిని తాగుతూ ఉండాలి.

నీరు తాగిన తర్వాత పళ్ళు తోముకోవడం, నోరు శుభ్రం చేసుకోవడం వంటివి క్రమం తప్పకుండా చేయాలి.

నీటిని తీసుకున్నాక 45 నిమిషాలు ఆగిన తర్వాత ఆహారం, పానీయాలు వంటివి తీసుకోవాడం వల్ల శరీరానికి పోషకాలను సమర్థవంతంగా అందుతాయి.

తీసుకున్న ఆహారాన్ని పూర్తిగా నమలాలి. భోజనం సమయంలో ఎక్కువ నీరు తాగకూడదు. ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

నీళ్ళు క్రమం తప్పకుండా ఒకే సమయంలో పరిమిత మోతాదులో తీసుకుంటూ ఉంటే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.

నీటిని తాగడం వల్ల అది మూత్రపిండాల్లోని విషపదార్థాలను బయటకు పంపి, మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని అరికడుతుంది.

ఈ డైట్ ను మరీ ఎక్కువగా ఫాలో అయితే ఓవర్ హైడ్రేషన్ కు దారితీసి, తలనొప్పి, వికారం, మైకం వంటి సమస్యలు తలెత్తుతాయంటున్నారు.