భోజనం తర్వాత గ్రీన్ టీ తాగవచ్చా.?
TV9 Telugu
12 October 2024
ప్రస్తుతం ఆరోగ్యం కోసం చాలామంది గ్రీన్ టీ తాగుతున్నారు. దీని రుచి నచ్చకపోయినా ప్రయోజనాల కోసం తాగడం మొదలుపెడుతున్నారు.
కాగా ఈ టీ శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లను మేరుపరుస్తుంది. జీవక్రియను పెంచి అధిక బరువును తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
గ్రీన్ టీ తాగితే టైప్-2 డయాబెటిస్ సమస్య దూరమవుతుంది. ఇంకా గ్రీన్ టీ తీసుకోవడం వల్ల చాల ప్రయోజనాలు ఉన్నాయి.
అయితే కొంతమంది భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగుతున్నారు. గ్రీన్ టీ ఇలా తాగితే ప్రయోజనలు ఉంటాయా లేదా తెలుసుకుందాం.
పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉన్న గ్రీన్ టీ జీర్ణక్రియకు ఉపయోగపడినప్పటికి భోజనం చేసిన వెంటనే దీన్ని తీసుకోకూడదు.
దీనిలోని కెఫిన్, టానిన్లు జీర్ణక్రియకు హాని కలిగించి అజీర్తికి కారణం అవుతాయని చెపుతున్నారు నిపుణులు.
కొంతమందికి ఉదయాన్నే ఏమి తినకుండా ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం అలవాటు. అయితే ఈ పద్దతి శరీరానికి హాని కలిగిస్తుంది.
ఖాళీ కడుపుతో దీన్ని తీసుకుంటే వికారం పుడుతుంది. దీనిలో ఉన్న టానిన్లు కారణంగా కడుపులో యాసిడ్ పెరిగి కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు వస్తాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి