క్యాన్సర్ భయాలు పెరుగుతున్న వేళ గుడ్‌న్యూస్, కేన్సర్‌ను అడ్డుకునేందుకు వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన బ్రిటన్ శాస్త్రవేత్తలు.
ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలు ఎక్కువయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంతగా మరణాలు సంభవిస్తున్నాయి.
2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు 77 శాతానికి చేరుకుంటాయని, ఏటా మూడున్నర కోట్ల మంది క్యాన్సర్ బారినపడతారని WHO హెచ్చరికలు జారీ చేసింది.
ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో బ్రిటన్ శాస్త్రవేత్తలు గుడ్‌న్యూస్ చెప్పారు. క్యాన్సర్‌ను అరికట్టే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్టు తెలిపారు.
క్యాన్సర్ మహమ్మారిని అడ్డుకునేందుకు వ్యాక్సిన్ తయారుచేశామని, కరోనా టీకా తయారీలో ఉపయోగించే మెసెంజర్ MRNA సాంకేతికతను వాడి టీకాను అభివృద్ధి చేసినట్టు వివరించారు.
గ్లోబల్ ట్రయల్స్‌లో భాగంగా బ్రిటన్‌లో క్యాన్సర్ రోగులపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించి మంచి ఫలితాలు సాధించినట్టు లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ శాస్త్రవేత్తలు తెలిపారు.
MRNA-4539 పేరుతో పిలుస్తున్న ఈ క్యాన్సర్ టీకాను చర్మ క్యాన్సర్‌తో బాధపడుతున్న సర్రేకు చెందిన 81 ఏళ్ల వృద్ధుడిపై ప్రయోగించారు.
ఈ ప్రయోగం సత్ఫలితాలు సాధించినట్టు పేర్కొన్నారు. ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చాయని వెల్లడించారు శాస్త్రవేత్తలు.