తెలంగాణ యువతలో 30 ఏళ్లకే బీపీ, షుగర్‌..!

TV9 Telugu

11 March 2024

తెలంగాణలో 30 ఏళ్లు దాటిన వారికి వైద్యశాఖ నాన్‌ కమ్యూనికబుల్‌ డీసీజెస్ (NCD) అంటు వ్యాధులు కాని రోగాలపై స్క్రీనింగ్.

విస్తుపోయే వాస్తవాలను బయటపెట్టిన స్క్రీనింగ్ టెస్టులు. యువతలో 12.4 శాతం మంది రక్తపోటు, 6.6 శాతం మంది షుగర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడి.

30 ఏళ్లుదాటిన వారు 1.82 కోట్ల మంది ఉండగా.. వారందరికీ ఎన్‌సీడీ స్క్రీనింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ హెల్త్ డిపార్ట్‌మెంట్.

జనవరి చివరి నాటికి 1.51 కోట్ల మందికి పరీక్షలు. అందులో 19.21 లక్షల మందికి బీపీ, 9.98 లక్షల మందికి మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ.

మెుత్తం యువతలో 19 శాతం మంది బీపీ, షుగర్ వ్యాధుల బారిన పడినట్లు చెబుతున్న వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో బీపీ, షుగర్‌ బాధితులు అత్యధికంగా ఉన్న జిల్లా మెదక్. 23 శాతం మంది రక్తపోటు, 14 శాతం మందికి షుగర్‌.

రెండో స్థానంలో వరంగల్‌ జిల్లా. 16 శాతం మంది బీపీ, 8 శాతం మంది షుగర్‌ వ్యాధిగ్రస్తులున్నట్లు వెల్లడి.

తీవ్రమైన ఒత్తిడిలో పని, సమయానికి తినకపోవటం, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ తినడం, శారీరక శ్రమ లేకపోవడం లాంటివి బీపీ, షుగర్లకు ప్రధాన కారణాలు అంటున్న డాక్టర్లు.