ఖాళీ కడుపుతో బీట్ రూట్.. సమ్యలకు ఫుల్ స్టాప్..
TV9 Telugu
07 July 2024
బీట్ రూట్ లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక సమస్యలను దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది ఆరోగ్య నిపుణులు ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో బీట్ రూట్ తినాలని సిఫార్సు చేస్తున్నారు.
రోజూ ఖాళీ కడుపుతో బీట్ రూట్ ను తీసుకుంటే.. దీని ప్రభావం కొద్ది రోజుల్లోనే కనిపించడం ప్రారంభమవుతుంది.
బరువు పెరగడం, పొట్ట, నడుము కొవ్వుతో ఇబ్బంది పడేవారు ఉదయాన్నే బీట్ రూట్ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
పిల్లలు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆహార నిపుణులు తెలుపుతున్నారు.
గర్భిణీలు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే కడుపులో బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ అందుతుందట. బిడ్డ కూడా ఎంతో ఆరోగ్యంగా పుడుతుందట.
బీట్ రూట్ జ్యూస్ ను రోజూ తాగితే హైబీపీ తదితర సమస్యలు దూరమవుతాయి. ఎముకల్ని దృఢంగా ఉంచే శక్తి కూడా బీట్ రూట్ కు ఉంది.
బీట్ రూట్ వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి కూడా పెరుగుతుంది. కాలేయం శుభ్రం కావడానికి కూడా బీట్ రూట్ ఎంతో ఉపయోగపడుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి