బొప్పాయి ఆకుల ఆరోగ్యానికి కొండత అండ..
31 August 2024
Battula Prudvi
బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో సహయపడతాయి. బొప్పాయి ఆకులలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
ఇందులో ఔషదగుణాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా డెంగ్యూ నివారణకు బొప్పాయి ఆకులు ఎక్కువగా ఉపయోగపడతాయి. దీన్ని రసంగా తాగవచ్చు.
బొప్పాయి ఆకుల రసం డెంగ్యూతో పోరాడటానికి, జర్వం ఎక్కువగా ఉన్న సమయంలో, శరీరంలో పడిపోతున్న ప్లేట్ లెట్స్, బలహీనంగా ఉండడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
బొప్పాయి ఆకుల రసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వలన జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయి.
మహిళలకు తరచుగా కడుపు నొప్పి, పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడంలోనూ ఈ రసం ఎక్కువగా ఉపయోగపడతాయి.
రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ బొప్పాయి ఆకుల రసం ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించడంలోనూ సహయపడుతుంది.
ఈ రసం తాగడం వలన రక్తంలో తెల్ల రక్త కణాలు , ప్లేట్ లెట్స్ పెరుగుతాయి. బొప్పాయి ఆకుల రసం తాగడం వలన ఐరన్ లోపం తగ్గుతుంది.
శరీరంలో ఐరన్ లోపాన్ని తగ్గించడమే కాకుండా.. రక్తంలో ప్లేట్ లెట్స్ పెంచుతాయి. ఐరన్ లోపం ఉన్నవారు ఈ రసం తీసుకోవడం మంచిది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి