ఇంట్లో మొక్కలు పెంచడం వల్ల ప్రయోజనాలు..

24 September 2023

ఇంట్లో మొక్కలు పెంచుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అయితే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మొక్కలు ఇంటికి సహజ సౌందర్యాన్ని తీసుకువస్తాయి. ఇల్లు చూడటానికి పచ్చగా కళకళలాడుతుంది. అందుకే మొక్కలను పెంచాలి.

ఇంట్లో మొక్కలు పెంచుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. వ్యాధులు దరిచేరవు.

ఇండోర్ ప్లాంట్స్ వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. ఒత్తిడి తగ్గుతుంది.

పచ్చని మొక్కలతో సమయం గడపడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుందని పలు పరిశోధనలు తేల్చాయి. అందుకే మొక్కలు ఇంట్లో నాటండి.

ప్రస్తుతకాలంలో చాలా మంది తమ ఇళ్ల డిజైన్లలో మార్పులు చేసి మరీ మొక్కల పెంపకంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు.

మొక్కలు చుట్టూ ఉండడం వల్ల ప్రశాంతంగా ఫీలవుతారు. దీని వల్ల ఒత్తిడి తగ్గడమే కాదండోయ్ జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

లావెండర్, జాస్మిన్ వంటి మొక్కలు మంచి సువాసనతో మూడ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లుగా పని చేస్తాయి. వీటి ప్రభావంతో మెరుగ్గా నిద్ర పోతారు.