సమ్మర్‌లో ఈ రైస్‌ తింటే..లాభాలే..లాభాలు!

TV9 Telugu

11 April 2024

ఎండాకాలం సమయంలో శరీరానికి చల్లదనాన్ని, పోషకాలను అందించే ఆహారంపై దృష్టి పెట్టాలి. లేదంటే సమస్యలు తప్పవు.

ప్రధానంగా ఫర్మెంటెడ్‌ రైస్‌ లేదా పులియ బెట్టిన పెరుగున్నం తినడం మంచిది. దీనిలో అనేక పోషకాలు ఉన్నాయి.

పొద్దున్నే తినే పెరుగన్నంలోని ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను మెరుగు పరిచి గట్ బ్యాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచుతుంది.

బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది మంచిది. వేసవి ఎండల తాపానాకి కడుపులో కూలింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది.

కాల్షియం, బీ12, విటమిన్ డీ, పీచు పదార్థం పుష్కలంగా లభిస్తుంది. ఎదుగుతున్న పిల్లల్లో బలమైన ఎముకలు ,దంతాలకు కావలసిన కాల్షియం అందిస్తుంది.

వండిన అన్నాన్ని వేడిగా ఉండగానే ఒక గిన్నెలోకి లేక మట్టిపాత్రలో తీసుకోవాలి. అందులో పాలు పోసి తోడు పెట్టాలి.

సన్నగా తరిగిన అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలిపి మూత పెట్టి రాత్రంతా అలాగే ఉంచితే చద్దన్నం తయారవుతుంది.

ఉదయానికి అదనపు పోషకాలతో చక్కగా పులిసి ఉంటుంది. దీంట్లో తాళింపు వేసుకొని, కొద్దిగా కొత్తిమీర చల్లుకుని తినవచ్చు.