ఖాళీ కడుపుతో ఈ పండ్లు.. మీకు ఆరోగ్యం పది రేట్లు..
TV9 Telugu
03 July 2024
కివి పండ్లలో చాలా పోషకాలు ఉన్నాయి. వీటిని ఖాళీ కడుపుతో తినొచ్చు. డెంగ్యూ బారిన పడిన వారికి కివి చాలా మంచిది.
తరుచు ఖాళీ కడుపుతో కివి పండుని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థని సక్రమంగా ఉండి శరీరానికి శక్తి అందుతుంది.
ఖాళీ కడుపుతో ఆపిల్ పండ్లను కూడా తినవచ్చు. దీని వల్ల బరువును అదుపులో ఉంచుకోవడంతో పాటు శరీరంలో పోషకాల కొరత కూడా తీరుతుంది.
ఖాళీ కడుపుతో ఆపిల్ పండ్లను తినడం వల్ల మలబద్ధకం, సమస్య తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ చక్కగా పని చేస్తుంది.
దానిమ్మ పండులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.
ఖాళీ కడుపుతో దానిమ్మ పండ్లను తినడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తగ్గుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
బొప్పాయి తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే బరువు అదుపులో ఉండాలంటే బొప్పాయి ఉత్తమం.
అలాగే కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది బొప్పాయి. మలబద్ధకం, కడుపు ఉబ్బరం సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి