అనారోగ్యంపై టెన్షన్ ఎందుకు దండగ.. ముల్లంగి ఉందిగా అండగా..

TV9 Telugu

02 June 2024

చాలామంది సాంబారులో  తినే ముల్లంగి ముక్కలను ఇష్టంగా తింటారు.ఈ ముల్లంగి కేవలం రుచికి మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి.

అందరికి  అందుబాటులో ఉన్న కూర‌గాయల్లో ముల్లంగి ఒక‌టి. ఇది ఘాటైన వాస‌న‌, రుచిని క‌లిగి ఉంటుంది. ముల్లంగిని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు.

అందుకు దీనిలో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు కూడా ఒక కారణం. ముల్లంగిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముల్లంగిలో కాల్షియం, మెగ్నిషియం, ఐర‌న్‌, పొటాషియం, జింక్, విట‌మిన్ సి వంటి ఎన్నో పోష‌కాలు పుష్కలంగా ఉండడం వల్ల శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది.

ముల్లంగిలో ఉండే ఫైబ‌ర్ కారణంగా జీర్ణ స‌మ‌స్య‌లు, గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. అలాగే అధిక బ‌రువు కూడా త‌గ్గుతారు.

శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ దీని వల్ల క‌రిగిపోతుంది. అందుకే ముల్లంగి తినాలని డాక్టర్లు సూచిస్తారు.

ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు కారణంగా మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే క్యాన్స‌ర్ వ్యాధులు రాకుండా ఉంటాయి.

గుండె స‌మస్య‌లు ఉన్న‌వారు నిత్యం ముల్లంగి తింటే ఎంతో మంచిది. అలాగే మ‌ధుమేహం ఉన్న‌వారు ముల్లంగిని తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి.