పిస్తా మిల్క్ తో ఆ సమస్యలన్నీ మటాష్..
TV9 Telugu
09 June 2024
పిస్తాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ బి6, ప్రొటీన్, కాల్షియం, ఐరన్ పెద్ద మొత్తంలో లభిస్తాయి.
ఇది షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుతుంది. మరి పిస్తా కలిపినా పాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పిస్తాపప్పులు, పాలు కాంబినేషన్‌లో కండరాలను బలోపేతం చేసే ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని రోజు తీసుకోవాలి.
పిస్తా పప్పులను పాలలో మరిగించి తింటే ఎముకలకు బలం చేకూరుతుంది. ఎందుకంటే పాలు పిస్తాలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.
ఇందులో ఉన్న కాల్షియం ఎముకలకు ఉపయోగకరంగా ఉంటుంది. పిస్తాలను పాలలో మరిగించి తాగితే కీళ్ల నొప్పులు దూరమవుతాయి.
కళ్ల ఉన్నవారు పిస్తాలను పాలలో మరిగించి తాగవచ్చు. దీనివల్ల కళ్లకు మేలు జరుగుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది.
పిస్తా పాలు కలిపి తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుందని అంటున్నారు పోషకాహార నిపుణులు.
పాలలో నానబెట్టిన పిస్తా పప్పులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అలాగే అనేక రకాల పోషకాలు అందడం వల్ల దృఢంగా ఉండగలుగుతారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి