రోజుకో జామపండు తినండి.. డాక్టర్ కి దూరంగా ఉండండి..
TV9 Telugu
04 July 2024
జామపండులో ఉండే ఫైబర్, పొటాషియం ఉంటాయి. ఇది తింటే బ్లడ్ ప్రెషర్ ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నయి. ఇవి క్యాన్సర్ కు వ్యతిరేకంగా పనిచేయడంలో దోహదపడుతాయి.
జామపండులో యాంటీ బాక్టీరియల్ గుణాలు చర్మ సమస్యల నుంచి కాపాడటంతో పాటు.. లోపలి నుంచి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.
జామకాయలోని ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్న కారణంగా అజీర్ణం, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యల నివారిస్తాయి.
జామపండులోనే విటమిన్ సీ అధికంగా లభిస్తుంది. ఇది కంటిచూపుని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇతర కంటి సమస్యలు కూడా నివారిస్తుంది.
షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా దీన్ని తినడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. కానీ.. పూర్తిగా పండిన జామకాయ కాకుండా.. ఓ మాదిరిగా ఉన్న కాయలనే తినడం మేలు.
పీరియడ్స్ సమయంలో చాలామంది మహిళలకు వచ్చే మూడ్ స్వింగ్స్ ను కూడా జామకాయ కంట్రోల్ చేయడంలో దోహదపడుతుంది.
పంటినొప్పి, నోటి అల్సర్ లను కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి జామకాయ మంచి ఆహారం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి