గ్రీన్ యాపిల్‌ ఆ సమస్యలకు యముడు..

TV9 Telugu

09 June 2024

అందరూ ఎక్కవగా రెడ్ యాపిల్ తింటారు. కానీ గ్రీన్ యాపిల్ వల్ల కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

గ్రీన్ యాపిల్స్ లో క్యాల్షియం ఉన్న కారణంగా ఎముకల ఆరోగ్యానికి కాపాడుతుంది. ఎముకలు బలహీనతో బాధపడేవారు వీటిని తినవచ్చు..

వీటిలో ఉండే పోషకాలు కాలేయాన్ని బలోపేతం చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వల్ల జీర్ణక్రియకు మేలు చేస్తాయి.

గ్రీన్ యాపిల్ తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. వీటితో ఆహారం ఎలాంటి సమస్యలు లేకుండా జీర్ణం అవుతుంది.

గ్రీన్ యాపిల్స్ లో ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల ఇవి రోజూ తింటే బరువు తగ్గవచ్చు.

గ్రీన్ యాపిల్ లో విటమిన్ ఎ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇది మన కళ్లకు మేలు చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

గ్రీన్ ఆపిల్ రోజు తీసుకోవడం వల్ల కంటి చూపును పెంచడంలో ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొంటున్నారు వైద్యులు.

దీన్ని తినడం వల్ల ఊపిరితిత్తుల పని తీరును బలోపేతం చేసి. శ్వాస సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.