12-02-2024

ఒక చెంచా నల్ల నువ్వులతో మధుమేహం ఇట్టే దూరం

TV9 Telugu

మధుమేహం నియంత్రించేందుకు వ్యాయామం, డైట్ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.

మధుమేహం నియంత్రించేందుకు నల్ల నువ్వులు ఎంతగానో ఉపయోగ పడతాయి. నల్ల నువ్వులు ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నల్ల నువ్వుల్లో ఉండే పోషక పదార్ధాల వల్ల మెదడు, చర్మం, శరీరంలోని ఇతర అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి.

నల్ల నువ్వులు  తినడం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్థులకు అనారోగ్య సమస్యలు తొందరగా దరిచేరవు. 

 మధుమేహం ఉన్నప్పుడు నల్ల నువ్వులు తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. 

ఉదయాన్నే 2 చెంచాల నానబెట్టిన నువ్వులు  తినటం వల్ల  అలసట, బలహీనత దూరమౌతాయి.   

ఇందులో అధిక మొత్తంలో ఉండే ప్రోటీన్లు, పినోరెసినోల్ అనే పోషకం కారణంగా శరీరంలో ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతాయి.