దీపావళి సంప్ర‌దాయ వంట‌కాల్లో వాడే ఆహార ప‌దార్ధాలతో జరభద్రం..

07 November 2023

దీపావళి పండగ సందర్భంగా సంప్ర‌దాయ వంట‌కాలు, స్వీట్స్‌, స్నాక్స్ అంటూ రకరకాలు డిష్‌లు నోరు ఊరిస్తుంటాయి.

నోరూరించే ఆహార ప‌దార్ధాల్లో హానికార‌క ప‌దార్ధాలు, ప్రిజ‌ర్వేటివ్స్ ఉన్నాయా అనేది తెలుసుకోవడం ఆరోగ్యరీత్యా చాల ముఖ్యం.

పండగ పూట పేగులకు అనారోగ్యాన్ని కలిగించే ఆహార ప‌దార్ధాల‌ను దూరం పెట్టాల‌ని పోష‌కాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పేగుల్లో దాగి ఉండే మంచి బ్యాక్టీరియా వ్య‌వ‌స్ధ‌ను ఆహార ప‌దార్ధాల్లో దాగిఉండే హానికర ఇంగ్రెడియంట్స్ దెబ్బతీస్తాయి.

పేగులు ఆరోగ్యంగా ఉంటేనే టోటల్‌ బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారంతో పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగి జీర్ణ‌క్రియ సాఫీగా సాగేట్టు చేస్తుంది.

ఆహార ప‌దార్ధాల్లో రుచికి జోడించే ప‌దార్ధాలు, నిల్వ ఉండేందుకు వాడే ప్రిజ‌ర్వేటివ్స్ పేగుల ఆరోగ్యంపై ఎఫెక్ట్‌ చూపిస్తుంటాయి.

కృత్రిమ తీపిప‌దార్ధాలు, కృత్రిమ రంగులు, అధికంగా సోడియం క‌లిసిన ఆహార ప‌దార్ధాల‌ను వీలైనంత మేరకు దూరం పెట్టాలి.

పెరుగు, మ‌జ్జిగ వంటి ప్రొ బ‌యాటిక్ అధికంగా ఉండే ఆహార ప‌దార్ధాల‌ను తీసుకోవ‌డం ద్వారా పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.