జీవితంలో బలంగా నిలబడటానికి బ్యాలెన్స్ కావాలి!

17 September 2024

Battula Prudvi 

చాలా మంది జీవితం ఫుల్ హ్యాపీగా సాగాలంటే బ్యాంకు బ్యాలెన్స్ సరిపోతుందనుకుంటారు. కానీ.. ఆరోగ్యం బ్యాలెన్స్ గా ఉండాలని గుర్తించరు.

వయసు పెరుగుతున్నకొద్దీ కండరాలు శక్తిని కోల్పోతుంటాయి. అప్పుడు సరిగ్గా నిలబడడం కూడా కష్టమవుతుంది. అందుకే హెల్త్​ బ్యాలెన్స్​ పెంచుకోవాలి.

సాధారణంగా వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులొస్తాయి. 40 ఏళ్ల తర్వాత మొదలయ్యే మజిల్ లాస్.. 50 తర్వాత వేగవంతం అవుతుంది.

అందుకే.. ముందు నుంచే హెల్త్​ బ్యాలెన్స్​ చేస్తూ.. బాడీని ఫిట్​గా ఉంచుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు.

నడక ఆరోగ్యానికి మంచి ఔషధం లాంటిదని చెబుతున్నారు వైద్యులు. నడక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

నడక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా అంటువ్యాధులు, ఇన్​ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

వీలున్న వారు ప్రతిరోజూ నడకతో పాటు వ్యాయామం కూడా చెయ్యడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు వైద్యులు.

మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటే.. ఆటోమెటిక్​గా మీ పనితీరు మెరుగుపడుతుంది. దాంతో మీ ఆర్థిక సంపాదన మెరుగవుతుంది.