గుడ్డు తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే.. అయితే ఈ వ్యాధులు ఉన్న వారు గుడ్డును తినటం చాలా హానికరం.
జీర్ణ సమస్యలు ఉన్నవారు గుడ్లను తీసుకోవడం హానికరం. వాస్తవానికి గుడ్డు చాలా నెమ్మదిగా అరుగుతుంది తద్వారా జీర్ణక్రియ సమస్యను పెంచుతుంది.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు గుడ్డును తినటం మానేయాలి. గుడ్డు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ఒకవేళ మీరు గుడ్డు తినాలి అంటే పసుపు భాగాన్ని తొలగించి తీసుకోవాలి.
గుండె సంభందిత సమస్యలు ఉన్నవారు గుడ్డును తీసుకున్నట్లయితే రక్త ప్రసరణలో ఆటంకం కలిగే అవకాశం ఉంది.
డయేరియా సమస్య ఉన్నవారు గుడ్లు తింటే సమస్యలు పెరుగుతాయి. ఇది కడుపు నొప్పి సమస్యను కూడ పెంచుతుంది.
గుడ్లను ఎక్కువగా తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండ ఇన్సులిన్ నిరోధకత కూడా ఏర్పడవచ్చు.