బిస్కెట్స్ ఎక్కువగా తింటున్నారా  ?? అయితే ఈ సమస్యలు తప్పవు 

Phani CH

25 SEP 2024

చాలా చోట్ల బిస్కెట్స్  ను స్నాక్స్ కింద పిల్లలు, పెద్దవాళ్లు తింటుంటారు.. అయితే బిస్కెట్స్  ఎక్కువ తినడం వల్ల ఈ సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు.

బిస్కెట్స్ లో ఎక్కువగా  మైదాపిండి, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, సోడియం పదార్ధాలు ఉండటం వల్ల ఆరోగ్యానికి ప్రమాదకరం.

మైదా పిండి తో చేసిన బిస్కెట్స్ తినడం వల్ల జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది. దీని వల్ల మలబద్ధకం సమస్య ఎదురవుతుంది

బిస్కెట్స్ తయారీలో మైదాతో పాటుగా పంచదారను ఎక్కువగా ఉపయోగిస్తారు. దాంతో దంత సమస్యలు, టైప్ 2 డయాబెటిస్ వంటివి ఎదురవుతాయి

పంచదార, ఉప్పు, ఫ్యాట్స్ ఉపయోగించి బిస్కెట్స్ తయారు చేయడం వల్ల పిల్లలకు  బిస్కెట్స్ తినడం వ్యసనంగా మారిపోతుంది.

బిస్కెట్స్‌లో ఎలాంటి పోషకాలు లేకపోయినా వీటిలో ఎక్కువ మొత్తం లో పంచదార, ఉప్పు ఉంటాయి. దాంతో బరువు పెరుగుతారు.

బిస్కెట్స్‌లో ఫైబర్ శాతం చాలా తక్కువ ఉంటుంది. దీంతో పిల్లలు డయేరియా వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది

బిస్కెట్స్‌లో నీటి శాతం తక్కువగా ఉంటుంది. దీంతో డిహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి అంతే కాకుండా గుండెకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి