డీహైడ్రేటెడ్ చిప్స్ హెల్దీయేనా?
TV9 Telugu
05 November 2024
బెండకాయ, కాకర, బీట్‌రూట్, క్యారట్ ఇతర కూరగాయల్ని డీహైడ్రేటెడ్ చిప్స్‌గా తయారుచేసి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు.
వీటిలోని తేమ శాతాన్ని తొలగించి.. క్రిస్పీగా మారుస్తారు. ఫైబర్, ప్రొటీన్లు, పాలీఫినోల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కోల్పోకుండా ఉంటాయి.
కృత్రిమ ప్రిజర్వేటివ్స్‌తో పనే లేదు కాబట్టి ఇవి ఆరోగ్యకరమే. అయితే కొనే ముందు లేబుల్ పరిశీలించడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
ఉప్పు ఎక్కువగా వాడడం, కృత్రిమ రంగులు, రుచిని పెంచడానికి ఆర్టిఫిషియల్ సీజనింగ్స్ వాడడం వంటివి జరగొచ్చు
పేరు మోసిన బ్రాండ్స్‌ని కొంటే మరీ మంచిది. పచ్చి కాయగూరలకు బదులుగా వీటిని తీసుకుంటే సరిపోతుందా అంటే సరికాదు.
ఎందుకంటే వెజిటబుల్ చిప్స్‌తో పోల్చితే పచ్చి కాయగూరల్లోనే పోషకాలు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
స్నాక్స్ సమయంలో సాధారణ చిప్స్‌కి బదలుగా డీహైడ్రేటెడ్ వెజిటబుల్ చిప్స్‌ని మితంగా తీసుకోవడం మేలంటున్నారు ఎక్స్‌పర్ట్స్.
ఆలా కాదని డీహైడ్రేటెడ్ వెజిటబుల్ చిప్స్‌ని అధికంగా తీసుకొంటే మాత్రం సమస్యలు తప్పవు అంటున్నారు పోషకాహార నిపుణులు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి