తృణధాన్యాలతో అనారోగ్య సమస్యలకు చరమగీతం..
27 September 2024
TV9 Telugu
2024 సంవత్సరనికిగానూ మెరుగైన ఆహారంగా ఎంపికైన మెడిటేరేనియన్ డైట్‌లో తృణధాన్యాలు అంతర్భాగంగా ఉన్నాయి.
ఫైబర్, నియాసిన్, థైమిన్, ఫోలేట్ వంటి బీ విటమిన్స్, ఐరన్, మెగ్నీషియం, సెలీనియం వంటి విటమిన్స్ ఇందులో ఉన్నాయి.
అందుకే తృణధాన్యాలను పోషకాల పవర్‌హౌస్. ప్రొటీన్, ఫ్యాటిక్ యాసిడ్, లిగ్నాన్స్, ఫురులిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు సైతం పుష్కలంగా ఉన్నాయి.
డ్రై ఓట్స్ సింగిల్ ఔన్స్‌లో 3 గ్రాముల ఫైబర్, రోజుకు సరిపడినంత మాంగనీస్, ఫాస్పరస్, ఇతర కీలక పోషకాలు లభిస్తాయి.
తృణధాన్యాలు నిత్యం తీసుకుంటే గుండె సమస్యల ముప్పు గణనీయంగా తగ్గుతుంది. రోజూ 28 గ్రాముల తీసుకుంటే హృద్రోగ ముప్పు 22 శాతం తగ్గుతుంది.
కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను మెరుగుపరిచి, బీపీని తగ్గించడంలో తృణధాన్యాలు చాల ప్రభావవంతంగా పనిచేస్తాయి.
తృణధాన్యాలు రెగ్యులర్‌గా ఆహారంలో భాగం చేసుకుంటే మధుమేహ నియంత్రణకు, బరువు తగ్గడంలోనూ సాయపడుతుంది.
తృణధాన్యాల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ద్వారా క్యాన్సర్ ముప్పు సైతం గణనీయంగా తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి