వేసవి లో ఉసిరి మనకు ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుందంట

Phani.ch

08 May 2024

ఈ సంవత్సరం మనదేశం లో ఎండలు దంచికొడుతున్నాయనే చెప్పాలి. ప్రజలు బయటకు వెళ్ళటానికి భయపడుతున్నారు. కానీ వెళ్లక తప్పడంలేదు.

ఇక తప్పక వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఎండ నుంచి ఉపశమనం కల్గించే పదార్ధాలు ఎక్కువ తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు.

ముఖ్యంగా సమ్మర్ లో ఉసిరి ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని చెబుతుంటారు. వాటి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఉసిరి లో మన శరీరానికి మేలు చేసే అనేక గుణాలుంటాయని నిపుణులు చెబుతుంటారు. ఉసిరి విటమిన్ లు, పోషకపదార్థాలు ఎక్కువగా కలిగి ఉంటాయి.

ప్రతిరోజు మనం తినే ఫుడ్ లో ఉసిరి తప్పకుండా ఉండేలా ప్లాన్ లుచేసుకొవాలి. అంతే కాదు ఉసిరి ఆవకాయ తిన్న కూడా అనేక జీర్ణక్రియ సమస్యలు దూరమైపోతాయి.

 ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురి అయ్యి  అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతుంటారు. ఇలాంటి వారి శరీరంలో ఉసిరి ప్రభావ వంతంగా పనిచేస్తుంది.

అంతే కాదు ఉసిరి దగ్గు సమస్యలను దూరం చేస్తుంది.  జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారికి ఉసిరి ఉపయోగపడుతాయి.

ఉసిరి రక్తంలోని చెడు కణాలను శుభ్రం చేస్తుంది. శరీరంపై అలెర్జీలు, బరువు తగ్గాలనుకునే వారిలో ఉసిరి ప్రభావ వంతంగా పనిచేస్తుంది.