శీతాకాలంలో ఆరోగ్యానికి దివ్యౌషధం బాదం..!

16 December 2023

బాదం ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్‌తో సహా లెక్కలేనన్ని పోషకాలు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

చలికాలంలో బాదంపప్పు ప్రతిరోజు మోతాదుకు మించకుండా తింటే రోగాలు తగ్గుతాయంటున్నారు డాక్టర్లు, నిపుణులు.

హెల్త్‌లైన్ ప్రకారం, బాదంపప్పును తినడం వల్ల సెల్ డ్యామేజ్‌ను నివారిస్తుంది. రోగాల బారినపడకుండా కాపాడుతుంది.

చలికాలంలో రోజూ బాదం తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుందంటున్నారు డాక్టర్లు.

శీతాకాలంలో డయాబెటిక్ ఉన్న పేషెంట్లు సైతం బాదంపప్పును తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు.

చలికాలంలో బాదంపప్పు తినడం వల్ల బరువు తగ్గడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

బాదం తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె జబ్బులకు కూడా చెక్ పెడుతుందంటున్నారు వైద్యులు.

చలికాలంలో ఎలర్జీ ఉన్నవారు బాదంపప్పుకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్య, ఆరోగ్య నిపుణులు.