25 October 2023
బాలికలలో వాయు కాలుష్యం వల్ల యుక్తవయస్సులో మార్పులు
కలుషిత గాలితో బాలికలకు త్వరగా రుతుక్రమం వస్తున్నట్లు పరిశోధకులు తేల్చారు.
బాలికలు రజస్వల అవడానికి, గాలి కాలుష్యానికి సంబంధం ఉందని అమెరికాలోని హార్వర్డ్, ఎమోరీ విశ్వవిద్యాలయాల పరిశోధకులు గుర్తించారు.
నివాస ప్రాంతాల్లో అధిక ధూళి కణాలు ఉన్న కలుషిత గాలిని బాల్యంలో పీల్చే బాలికలకు రుతుక్రమం త్వరగా వస్తుందని గుర్తించారు.
ఇటువంటి బాలికలు తమ జీవితంలో అనేక వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.
గుండె జబ్బులు, టైప్-2 మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు వారికి సోకే ప్రమాదం ఉందన్నారు.
పూర్వం ఆడపిల్లలకు పన్నెండు, పదమూడేళ్లకే రుతుక్రమం వచ్చేది. కానీ ఈ రోజుల్లో ఏడెనిమిదేళ్లకే రుతుక్రమం వస్తోంది.
దీంతో వారు శారీరక సమస్యలకు గురవుతున్నారు. కొన్ని పౌష్టికాహారాలు ఇవ్వడం ద్వారా వారిని సమస్య నుంచి బయటపడేయవచ్చు.
నువ్వుల లడ్డు, పొద్దు తిరుగుడు గింజలు ఉన్న ఆహారం ఇవ్వాలి. ఇది ఈస్ట్రోజెన్‌పై మంచి ప్రభావం చూపుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి