TV9 Telugu
మీ డైట్ లో ఈ ఆహారాలు.. అధిక బరువు సమస్యకు చరమగీతాలు..
23 Febraury 2024
బరువు సమస్య ఉన్నవారు ఆరోగ్యకర ఆహారంతో పాటు వ్యాయామంతో ఆశించిన ఫలితాలను రాబట్టవచ్చంటున్నారు నిపుణులు.
నిత్యం వ్యాయామంతో పాటు ప్రతిరోజు సరైన ఆహార పదార్ధాలు తీసుకోవడం ద్వారా బరువు చాలా సులభంగా తగ్గవచ్చు.
ఆటు వ్యాయామం, ఇటు ఆహారంలో మార్పులతో సత్వరమే శరీరం బరువు తగ్గవచ్చని పోషకాహార నిపుణులంటున్నారు.
పలు రకాల ఫుడ్ కాంబినేషన్స్‌తో అనుకున్న ఫలితాలను రాబట్టవచ్చని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
నిర్ధిష్ట ఆహార పదార్ధాలను మేళవించడం ద్వారా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. పెప్పర్‌తో పొటాటో కలపి తీసుకోవడం వల్ల బరువు వేగంగా తగ్గుతారు.
దాల్చిన చెక్కతో కాఫీని తీసుకోవడం వల్ల సులభంగా చెడుకొలెస్ట్రాల్ కరిగిపోతుందని చెబుతున్నారు నిపుణులు.
సాస్‌తో చనా, రైస్‌తో బఠాణీలు, హెల్ధీ ఫ్యాట్స్‌తో పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఈ ఫుడ్ కాంబినేషన్స్‌తో పొట్టలో కొవ్వును కూడా ఇట్టే కరిగించేయవచ్చు.
మనం ఎలాంటి ఆహారం తీసుకున్నామనే దానిపై మన శరీరం వాటి నుంచి పోషకాలను సంగ్రహిస్తుంది. జీర్ణక్రియ సజావుగా సాగేలా చేయడం ఆధారపడి ఉంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి