వైరస్ లేకుండా వేగంగా విస్తరిస్తున్న మహమ్మారి

TV9 Telugu

11 May 2024

వైరస్ లేకుండా కూడా ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది.. సంచలన విషయాలు వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. .

కరోనా వైరస్ ఇంకా ముగియలేదు. కొత్త మహమ్మారి పుట్టింది. అయితే, దీని వ్యాప్తికి కారణం ఏదైనా వైరస్ లేదా వ్యాధి కాదంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ.

ఈ కొత్త అంటువ్యాధి చాలా దగ్గరగా వచ్చిందని WHO అధికారి పేర్కొన్నారు. అలాగే, దీని కారణంగా పరిస్థితి ఇప్పటికే చాలా అనియంత్రితంగా మారిందన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్ ప్రాంతీయ డైరెక్టర్ హన్స్ క్లూగే తదుపరి మహమ్మారి మానసిక ఆరోగ్య సంక్షోభం అని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితుల కారణంగా ఈ మహమ్మారి ప్రజలను వణికిస్తోందంటున్నరు ఆరోగ్య నిపుణులు.

ఈ మహమ్మారి పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయని అంటు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు నివేదికలో వెల్లడించారు.

గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న అనేక యుద్ధాలు, మునుపటి అంటువ్యాధులు, వాతావరణ మార్పుల కారణంగా ఇది ప్రజలలో తలెత్తుతుందని క్లూగే చెప్పారు.

యూరప్‌లో ప్రతి ఆరుగురిలో ఒకరు దీనితో ఇబ్బందులు పడుతున్నరు. దానిని ఎదుర్కోవటానికి ప్రపంచ దేశాలు కలిసి పనిచేయవలసి ఉంటుంది.