21 February 2024

ఈ పదార్ధాలతో మీ గుండె పదిలం

TV9 Telugu

ధనియాలు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరాయిడ్స్ స్థాయి తగ్గించేందుకు చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. 

 నల్ల మిరియాలు శరీరానికి చాలా మంచిది.  సీజన్ మారినప్పుడు అనేక వ్యాధుల్నించి కాపాడటమే కాదు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అద్భుతంగా పనిచేస్తాయి. 

 దాల్చినచెక్క ప్రతి కిచెన్‌లో తప్పకుండా ఉంటుంది. గుండె వ్యాధుల్నించి కాపాడటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

దాల్చినచెక్క రక్తాన్ని పలుచగా చేస్తుంది. రోజూ కొద్గిగా దాల్చినచెక్కను తీసుకుంటే చాలు గుండె పదిలంగా ఉంటుంది. 

పసుపులో అనేక పోషక విలువలు కలిగి ఉన్నాయి. ఇది బాహ్య చర్మం నుంచి అంతర్ ఆరోగ్యం వరకూ చాలా ప్రయోజనకారిగా ఉంటుంది.

పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. గుండె వ్యాధుల్నించి కాపాడుతుంది.

 వెల్లుల్లి ఆహారపు అలవాట్లు సరిగ్గా ఉంటే చాలా వరకు వ్యాధులు దరిచేరవు. ముఖ్యంగా వెల్లుల్లిని గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు వినియోగిస్తారు.