వర్షాకాలం వస్తుందంటేనే అనేక వ్యాధులు వస్తుంటాయి. వాటిలో ఒకటి డెంగ్యూ. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కాగలదు.
డెంగ్యూ సోకితే శరీరంలో ప్లేట్లెట్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఈ 5 ఫ్రూట్స్ తీసుకుంటే ప్లేట్లెట్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అవేంటో తెలుసుకుందాం.
కివీలో కాపర్, పొటాషియం, విటమిన్ ఇ, విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తాయి. ఇవి రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి, ఇమ్యూనిటీ పెంచడంలో, ఎలక్ట్రోలైట్స్ బ్యాలెస్స్ కోసం ఉపయోగపడతాయి.
అనాదిగా బొప్పాయి అనేది ప్లేట్లెట్స్ సంఖ్య పెంచేందుకు ఉపయోగిస్తున్నారు వైద్యులు. ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ డెంగ్యూతో పోరాడే శక్తిని అందిస్తుంది.
బత్తాయిలో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో , ప్లేట్లెట్స్ సంఖ్య పెంచడంలో ఉపయోగపడుతుంది.
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తపోటును అదుపు చేసి ప్లేట్లెట్స్ సంఖ్య పెంచుతుంది
కొబ్బరి నీళ్లు ఇక ప్రకృతిలో విరివిగా లభించే అద్భుతమైన అమృతం కొబ్బరి నీళ్లు. శరీరానికి అవసరమైన మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ అందిస్తుంది. డెంగ్యూలో ఏర్పడే డీ హైడ్రేషన్ సమస్య నుంచి కాపాడుతుంది.