పిల్లలతో క్వాలిటీ సమయం ఎలా గడపాలి?

03 December 2023

గుజరాత్‌లో గడిచిన ఆరు నెలల్లో గుండెపోటు కారణంగా 1052 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం తెలిపింది.

వీరిలో 80 శాతం మంది 11-25 ఏళ్ల మధ్య వయసు వారే అన్నది ఆందోళనకరంగా మారిన వార్త అని తెలిపింది ప్రభుత్వం.

గుండెపోటు ఘటనలు పెరుగుతోన్న నేపథ్యంలో సీపీఆర్‌ పై దాదాపు 2 లక్షల మంది టీచర్లు, కాలేజీ ప్రొఫెసర్లకు శిక్షణ ఇవ్వనుంది ప్రభుత్వం .

చనిపోయిన వారిలో ఉన్న విద్యార్థులు, యువకులు ఎవ్వరు ఊబకాయులు కూడా కాదు, ముందు గుండె సమస్యలు వారిలో లేవని చెబుతుంది.

అంతేకాకుండా హృదయ సంబంధిత కారణాలతో రోజుకు సగటున 173 ఎమర్జెన్సీ కాల్స్‌ వస్తున్నట్లు గుజరాత్‌ విద్యాశాఖ మంత్రి కుబేర్‌ డిండోర్‌ అన్నారు.

బాధితుల్లో ఎక్కువగా చిన్నవయసు వారే ఉండటంతో గుండెపోటుపై యువకుల్లో అన్ని ప్రాంతాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

కాలేజీ ప్రాంగణంలో క్రికెట్‌ ఆడుతుండగా, గర్బా నృత్యం చేస్తున్న సమయంలో ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్రవ్యాప్తంగా శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇందులో 2500 మంది వైద్య నిపుణులు పాల్గొని దాదాపు రెండు లక్షల మంది టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.