ఉసిరికాయను సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి

ఈ పోషకాలు అనేక వ్యాధుల నుంచి మనల్ని రక్షించడంలో సహాయపడతాయి

ఉసిరి రసాన్ని పరగడుపున తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది

ఉసిరి రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం

ఉసిరి రసంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి

ఉసిరి రసం మూత్రపిండాల్లో రాళ్లను తొలగిస్తుంది

రోజూ ఉసిరికాయ రసాన్ని తీసుకోవడం వల్ల కంటి చూపు బాగుంటుంది

పరగడుపున ఉసిరి రసం తాగడం వల్ల రోజు మొత్తం ఎనర్జిటిక్‌గా ఉంటారు