అనారోగ్యకరమైన ఆహారం, సరికాని జీవనశైలి కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది
కడుపు ఉబ్బరం, గ్యాస్ సంబంధిత సమస్యలు మొదలైనవి తలెత్తుతాయి
కిచెన్‌లో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించి కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య నుంచి త్వరితగతిన ఉపశమనం పొందవచ్చు
అంతేకాదు.. ఇవి మీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి
మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం
గోరువెచ్చని నీటిలో ఒక చెంచా వాము గింజలు కలిపి తీసుకుంటే గ్యాస్ సమస్యకు చెక్ పెట్టొచ్చు
ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు జీలకర్ర నీరు త్రాగాలి. ఇది ఉబ్బరం సమస్య నుండి ఉపశమనం ఇస్తుంది
నిమ్మకాయ సోడా తీసుకోవచ్చు. ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం, బేకింగ్ పౌడర్ కలిపి తీసుకోవాలి
ఒక టీస్పూన్ త్రిఫల పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి
త్రిఫల చూర్ణం తినడం జీర్ణక్రియకు సంబంధించిన సమస్యల నుండి బయటపడతారు