వర్షా కాలం లో అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి

నిరంతర దగ్గుతో బాధపడుతున్నారా ?? అయితే ఈ చిట్కాలు మీ కోసం

 విపరీతమైన దగ్గు, జలుబు ఉన్నట్లయితే వేడి నీటిలో విక్స్ వేసి ఆవిరి పట్టాలి.

నిరంతర దగ్గు వేధిస్తున్నట్లయితే.. చల్లటి నీరు అస్సలు తాగొద్దు. వేడి చేసిన నీటిని మాత్రమే తాగాలి.

అలెర్జీ వల్ల దీర్ఘకాలిక దగ్గు, సైనస్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి సందర్భంలో వైద్యుల సలహా మేరకు అవసరమైన మెడిసిన్స్ వాడాలి.

పొడి దగ్గు ఉన్నట్లయితే లాజెంజ్‌‌(స్ట్రెప్సిల్, విక్స్ వంటి బిల్లలు) చప్పరించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. అయితే, వీటిని పిల్లలకు ఇవ్వొద్దు.

జలుబు, ఫ్లూ లక్షణాలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. ధూమపానం మానేయాలి.

బాక్టీరియా చేతుల ద్వారా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. తద్వారా జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తుతాయి.