మెట్రో ప్రయాణం ఇప్పుడు ప్రజల జీవితంలో భాగమైపోయింది

ఈ పోటీ ప్రపంచంలో త్వరగా గమ్యస్థానాలకు చేరాలంటే చాలామంది మెట్రో రైళ్లనే ఆశ్రయిస్తారు

రద్దీగా ఉండి సీటు దొరక్కపోయినా అందులోనే నిల్చొని ప్రయాణం చేస్తుంటారు

కానీ ఈ జర్నీతోనూ కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురవుతాయంటున్నారు నిపుణులు

ముఖ్యంగా మధ్య వయస్కుల వారు మెట్రో జర్నీలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు

ప్రతిరోజూ ఎక్కువ సేపు నిలబడి దూర ప్రయాణాలు చేయడం ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది

అయితే కొన్ని సాధారణ చిట్కాలను పాటించడం ద్వారా ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు

నిలబడి ఉన్నప్పుడు పొజిషన్‌ మార్చుతూ ఉండాలి

బరువైన బ్యాగ్‌లను నేలపై ఉంచి జర్నీ చేయాలి