ప్రస్తుత జీవనవిధానంలో తెల్ల జుట్టు కామన్ అయిపోయింది. అందుకే చాలా మంది జుట్టుకు కలర్ వేస్తున్నారు
ఆడ,మగ అని తేడా లేకుండా హెయిర్ డైను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు
అయితే హెయిర్ డైలో ఉపయోగించే రసాయనాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి
హెయిర్ డైలో అమ్మోనియా, హెయిర్ ఫార్మాల్డిహైడ్, బి-ఫినైల్నెడిమిన్ (పిపిటి), బొగ్గు తారు, రెసోర్సినాల్, యూజీనాల్ ఉన్నాయి
జుట్టు రంగులలో రసాయనాల వల్ల ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలు వస్తాయి
హెయిర్ డైలోని బి-ఫెనిలెనెడిమిన్ అనే రసాయనాన్ని చర్మంలోకి శోషించడం వల్ల అలర్జీ చర్మశోథ వస్తుంది
గర్భధారణ సమయంలో జుట్టుకు కలర్ వేయడం వల్ల తల్లి, పుట్టబోయే బిడ్డకు హానికరం
ఫార్మాల్డిహైడ్, బొగ్గు , సీసం అసిటేట్ మరియు ఇతర హానికరమైన రసాయనాల వల్ల వివిధ రకాల క్యాన్సర్లకు కారణమవుతాయి