భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక స్థానముంది. హిందువుల ఇళ్లల్లో ప్రతి రోజూ తులసి పూజ చేస్తారు. లక్ష్మీ దేవిలా కొలుస్తారు.

కేవలం మతపరంగానే కాదు.. తులసితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తలసిని తీసుకుంటే.. అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.

ఈ రోజుల్లో చాలా మందికి మలబద్ధక సమస్య ఉంది. ఇలాంటి వారికి తులసి ఆకులు ఎంతో మేలు చేస్తాయి. ఖాళీ కడుపుతో తులసి ఆకులను తీసుకుంటే మలబద్ధకం తొలగిపోతుంది.

జీర్ణక్రియ ప్రక్రియ సజావుగా జరిగేందుకు తులసి దోహదం చేస్తుంది.మీరు ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నట్లయితే తులసి ఆకులు మీకు ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

వీటిని ఖాళీ కడుపుతో తినడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.తులసి ఆకులను ఖాళీ కడుపుతో తీసుకుంటే గుండోకు ఎంతో మంచిది.

గుండె ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ తులసిలో ఉంటాయి. అందువల్ల తరచూ తులసి ఆకులను తీసుకుంటే గుండె సమస్యలు రావు.

తులసిలో ఉండే పొటాషియం, ఫోలేట్ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎముకలను బలంగా మార్చుతాయి.