ప్రకృతి వరప్రసాదమైలభ్యమయ్యే పండ్లల్లో నేరేడు ఒకటి. ఈ పండులో అద్భుత పోషకాలు ఉంటాయి.

వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పిండిపదార్థాలు, మాంసకృత్తులు, ఫాస్ఫరస్‌, క్యాల్షియం, ఇనుము శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలను అందిస్తాయి.

నేరేడు పండ్లను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగుతుంది.అయితే ఈ పండ్లు ఎంత ప్రయోజనం అయిప్పటికీ..

కొన్ని సార్లు మనం చేసే ఈ పొరపాట్లు తీవ్ర దుష్పరిణామాలకు దారి తీస్తాయి. అందుకే వీటిని తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వీటిని కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. 

నేరేడు పండ్లు చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను తొలగిస్తాయి.

యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు అద్భుతంగా పని చేస్తాయి. కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి.

అయితే వీటిని సరైన కాంబినేషన్‌తో కలిపి తినకపోతే మాత్రం ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుంది.