ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు కొంతమంది అయితే..అసలు ఆరోగ్యం గురించి ఆలోచించని వారు ఉంటారు.

మనం తీసుకునే ఆహారమే ముఖ్య కారణం. మారిన జీవన విధానానికి అనుకూలంగా మనకు తెలియకుండా విషపూరిత ఆహారం తింటున్నాం.

చాలా మంది భోజనం చేసిన తరువాత అలాగే పడుకోవడం గాని కూర్చోవడం గాని చేస్తుంటారు. అయితే..

రాత్రి పూట తిన్న తరువాత పడుకోకూడదని..నడవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

లా నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.

భోజనం చేశాక కొంత సమయం నడిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే పెప్టిక్ అల్సర్లు, గుండెల్లో మంట, మలబద్దకం, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించవచ్చని చెబుతున్నారు.

రాత్రి తిన్న తరువాత కొంత సేపు నడిస్తే చక్కర స్థాయి అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. టైప్ 2 డయాబెటిక్ పేషేంట్స్ తిన్న తరువాత 10 నిముషాలు నడిస్తే చక్కర స్థాయి కంట్రోల్ లో ఉంటుంది.