బీరకాయ తెలియని వారు ఎవరూ ఉండరు. మనం రోజూ తీసుకునే ఆహారాల్లో బీరకాయ కూడా ఒకటి. చాలా మంది బీరకాయ తినడానికి ఇష్టపడుతారు.

బీరకాయతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు.. శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

చికెన్ గున్యా, డెంగ్యూ, వైరల్ ఫీవర్ వంటి జబ్బుల బారిన పడకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది బీరకాయ.

అంతేకాదు.. దీనిని సరైన రీతిలో తీసుకుంటే ఎలాంటి జ్వరమైన ఇట్టే తగ్గిపోతుందని చెబుతున్నారు నిపుణులు.

అయితే, ఈ బీరకాయలోని ఔషధ గుణాల ప్రయోజనం శరీరానికి పూర్తిగా అందాలంటే ఎలా తీసుకోవాలో ఇవాళ మనం తెలుసుకుందాం..

బీరకాయ, 100 గ్రాముల బెల్లం, సగం నిమ్మకాయ ముక్క, చిన్న గ్లాసు వాటర్‌తో కలిపి జ్యూస్ చేయాలి. జ్వరం వచ్చిన వారు ఆ జ్యూస్ కొంత నోటిలో వేసుకుని పుక్కిలించాలి.

మిగతా జ్యూస్ తాగాలి. ఆ తరువాత అరగంట పాటు నిద్రపోతే జ్వరం తగ్గిపోతుంది. విపరీతమైన జ్వరం ఉంటే.. మూడు రోజుల పాటు ఇలా చేస్తే నయం అవుతుంది.

బొడ్డుతాడులో ఎలాంటి ఔషధ గుణాలు ఉంటాయో.. బీరకాయ గుజ్జులోనూ అంతే ఔషధ గుణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.