నవ్వడం వలన కలిగే ప్రయోజనాలు..! నిజంగా ఇన్ని లాభాలు ఉన్నాయా..?
నవ్వడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎక్కువగా నవ్వడంతో శరీరంలో హ్యాపీ హార్మోన్లు రిలీజ్ అవుతాయి.
దీంతో ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. ఆరోగ్యం మెరుగువడుతుంది.ఒత్తిడి తగ్గడంతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగువడుతుంది.
నవ్వినప్పుడు శరీరం న్యూరో పెప్టైడ్స్ ని విడుదల చేస్తుంది. ఇవి ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి.
ఒత్తిడి సమయంలో రక్తపోటు, హృదయ స్పందన పెరుగుతుంది. ఇటువంటి సమయంలో నవ్వడంతో ఎండార్ఫిన్ అనే ఫీల్- గుడ్ హార్మోన్ విడుదల అవుతుంది.
ఇది హృదయ స్పందన రేటు, రక్తపోటును స్థిరీకరించడంలో నహాయపడుతుంది.
ఎక్కువగా నవ్వడంతో నలుగురి దృష్టిని ఆకర్షించగలం. నవ్వు సహజంగా సంబంధాలను మెరుగుపరుస్తుంది.
నవ్వినవ్వుడు సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ అందోళన, నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఎక్కువగా నవ్వుతూ ఉండటంతో వయస్సు కనపించదు. నిత్యం నవ్వుతూ ఉండేవారు తమ కంటే మూడేళ్లు చిన్నవారిలా కనిపిస్తారు.