కీరదోసతో ఎన్నో ఉపయోగాలున్నాయి. వేసవిలో మాత్రమే కాకుండా చలికాలంలోనూ వీటిని తినాలి.
కీరదోసలో 90 శాతం నీరు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి
డీ-హైడ్రేషన్‌కు గురైనప్పుడు కీరదోస ముక్కలు తినడం శ్రేయస్కరం
హైబీపీ ఉన్నవారు క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది
పీచు పదార్థం శరీరంలోని చక్కెరను నెమ్మదిగా విడుదల అయ్యేలా చేస్తుంది
జీర్ణ వ్యవస్థను శుభ్రపర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది
చర్మ సౌందర్యం కోసం కూడా కీరదోసను వాడుతుంటారు
యాంటీఆక్సిడెంట్స్ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తాయి
కీరదోస కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది
మూత్రపిండాలపై పడే అదనపు భారాన్ని కీరదోస తొలగిస్తుంది