పుచ్చకాయ విత్తనాల్లో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. 100 గ్రా. పుచ్చకాయ విత్తనాలను తీసుకుంటే వాటిలో 600 క్యాలరీల శక్తి ఉంటుంది.
పుచ్చకాయ విత్తనాలను పుచ్చకాయల్లాగే నేరుగా తినవచ్చు. లేదంటే ఎండబెట్టి పొడి చేసుకుని నీటిలో కలుపుకుని తాగవచ్చు.
పుచ్చకాయ విత్తనాల్లో ఫైబర్ ఎక్కువే. ఇది జీర్ణ సంబంధ సమస్యలను తొలగిస్తుంది
లివర్ వ్యాధులు, వాపులతో బాధపడే వారికి పుచ్చకాయ విత్తనాలు చక్కని ఔషధంగా పనిచేస్తాయి
యాంటీ ఏజింగ్ లక్షణాలు పుచ్చకాయ విత్తనాల్లో ఉన్నాయి. చర్మంపై వచ్చే ముడతలు పోతాయి.
డయాబెటిస్ ఉన్న వారికి పుచ్చకాయ విత్తనాలు మేలు చేస్తాయి. ఇవి వారి రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపు చేస్తాయి.
జ్వరం వంటివి వచ్చినప్పుడు పుచ్చకాయ విత్తనాలను మరిగించి చేసిన నీటిని తాగిస్తే త్వరగా కోలుకుంటారు