వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. సీజనల్ పండ్లు, కూరగాయల ద్వారా మన శరీరంలో తగినంత హైడ్రేషన్ లభిస్తుంది.

పుచ్చకాయ వంటి పండ్లు ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం..

పుచ్చకాయలోని సిట్రులిన్ రక్తపోటును తగ్గించడంలో సహాయం చేస్తుంది.

పుచ్చకాయలో ఉండే లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వలన కలిగే డీఎన్ఏ నష్టాన్ని తగ్గిస్తుంది, తద్వారా వ్యాధులను నివారిస్తుంది .

పుచ్చ‌కాయ రోజూ తిన‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. దీని వ‌ల్ల గుండెపోటు వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది.

కొన్ని ర‌కాల కేన్స‌ర్ వ్యాధుల‌ను నిరోధించే ల‌క్ష‌ణాలు కూడా ఉన్న‌ట్లు ప‌లు అధ్య‌య‌నాల్లో తేలింది.

 పుచ్చ‌కాయ‌లో ఉండే విట‌మిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జుట్టును అందంగా, బ‌లంగా మారుస్తుంది.

పుచ్చకాయలో ఉండే లైకోపీన్, విటమిన్ ఎ, విటమిన్ ఇ కంటి సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయం చేస్తాయి

క‌డుపుతో ఉన్న మ‌హిళ‌లు పుచ్చ‌కాయ తినడం వ‌ల్ల పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది.

కిడ్నీలో రాళ్లు ఉన్న‌వారు, మ‌ల‌బ‌ద్ధ‌కంతో బాధ‌ప‌డేవారు నిత్యం పుచ్చకాయ తింటే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.